Venkatesh Daggubati: 'నారప్ప' రెస్పాన్స్ మాటల్లో చెప్పలేను: వెంకటేశ్

  • 'అసురన్' రీమేక్ గా రూపొందిన 'నారప్ప'
  • నిన్ననే అమెజాన్ ప్రైమ్ లో విడుదల
  • అనూహ్యమైన రెస్పాన్స్
  • కథాకథనాలే ప్రధానమైన బలం
Venkatesh is happy about Narappa movie reponse

వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప', నిన్ననే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్'కి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా హిట్ కావడమే కాకుండా, నటన పరంగా ధనుశ్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

ఇక తెలుగులో విడుదలైన 'నారప్ప'కు కూడా మంచి రెస్పాన్ వస్తోంది. ఈ విషయంపై తాజాగా వెంకటేశ్ స్పందించారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందనీ, ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. ఇంతగా ఈ సినిమాను ఆదరిస్తున్నవారికి థ్యాంక్స్ చెప్పారు.

'నారప్ప' ఒక సాధారణమైన రైతు. తనకున్న 3 ఎకరాల పొలంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. పండుసామి అనే వ్యక్తి ఆ కాస్త పొలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అడ్డొచ్చిన నారప్ప పెద్ద కొడుకును చంపేస్తాడు. ఆ కోపంతో నారప్ప చిన్నకొడుకు, ఎవరూ ఊహించని పని చేస్తాడు. దాంతో అతణ్ణి తీసుకుని అడవుల్లోకి నారప్ప పారిపోతాడు. ఆ తరువాత చోటుచేసుకునే మలుపులతో కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బలమైన కథాకథనాల వల్లనే ఈ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News