కర్రలు, రాడ్లతో ముగ్గురు రైతులపై వంద మంది దాడి

21-07-2021 Wed 15:03
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • పొలం పనులు చేస్తుండగా దాడి
  • ఆస్తి తగాదాలేనని అనుమానం
100 Members Attacks 3 Farmers

ముగ్గురు రైతులపై వంద మంది దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెంలో జరిగింది. రైతులంతా పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా.. కర్రలు, రాడ్లతో వచ్చిన దుండగులు వారిపై దాడికి తెగబడ్డారు.

గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జి అనే ముగ్గురు రైతులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దాడికి ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.