అశోక్ గజపతిరాజుపై ఆరోపణలు గుప్పిస్తూ.. ప్ర‌ధాని మోదీకి విజ‌య‌సాయిరెడ్డి లేఖ‌

21-07-2021 Wed 13:01
  • 2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం
  • రైలు పట్టాలు తప్పి 42 మంది మృతి
  • ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా ప్రభావితం చేశారు
  • అశోక్ గజపతిరాజుపై అత్యున్నత విచారణ జరిపించాలి
vijay sai reddy writes letter to modi

కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ఆరోప‌ణ‌లు గుప్పించారు. 2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశాన‌ని ఆయన పేర్కొన్నారు.

'2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా ప్రభావితం చేసిన అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అత్యున్నత విచారణ జరిపించాలని ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాయడం జరిగింది' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.