మ్యాచ్ జ‌రుగుతుండ‌గా మైదానంలోకి వ‌చ్చిన శ్రీ‌లంక కోచ్‌.. షనకతో గొడ‌వ.. వీడియో వైర‌ల్

21-07-2021 Wed 11:48
  • వ‌న్డే మ్యాచ్ ఓడిపోయిన శ్రీ‌లంక
  • చివ‌రి ఓవ‌ర్లు కొన‌సాగుతోన్న స‌మ‌యంలో వ‌చ్చిన కోచ్
  • ఆయ‌న‌కు గ‌ట్టిగా బ‌దులిచ్చిన శ్రీ‌లంక కెప్టెన్
arthar video goes viral

శ్రీలంకతో జ‌రిగిన వ‌న్డే మ్యాచులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ్రీ‌లంక ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌కు, ఆ జ‌ట్టు కెప్టెన్‌ దాసున్ షనకల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. శ్రీ‌లంక ఆట‌గాళ్లు మ్యాచుపై ప‌ట్టు కోల్పోతోన్న స‌మయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో ఊగిపోయిన ఆర్థ‌ర్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

మ్యాచ్‌ చివరి ఓవ‌ర్ల స‌మ‌యంలో ఆర్థర్  మైదానంలోకి వచ్చి కెప్టెన్‌ షనకతో మాట్లాడారు. అదే స‌మ‌యంలో షనక కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మధ్య  వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా, మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో కోచ్ ను మైదానంలోకి ఎందుకు రానిచ్చార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.