'ఆర్ఆర్ఆర్' సెట్స్ లో అందాల అలియా భట్!

21-07-2021 Wed 10:17
  • ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్'  
  • చివరి షెడ్యూల్ షూటింగ్   
  • తెలుగులో అలియాకు తొలి సినిమా
  • దసరాకి భారీ స్థాయి రిలీజ్  
RRR movie shooting update

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. చారిత్రక నేపథ్యాన్ని జోడిస్తూ అల్లుకున్న కథ ఇది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను, భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కరోనా కారణంగా ఆగిన షూటింగు రీసెంట్ గా తిరిగి మొదలైంది. ఈ షెడ్యూల్లో మళ్లీ అలియా భట్ పాల్గొంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తనే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అలియా భట్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది .. దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ తరం కథానాయికలలో గ్లామర్ తో పాటు, అభినయం కూడా తెలిసిన నాయికగా ఆమెని గురించి చెబుతుంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర భావోద్వేగాలతో కూడినదిగా ఉంటుంది. అందువల్లనే ఆమెను ఎంపిక చేశారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అధికారికంగానే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తో పాటు పలువురు హాలీవుడ్ ఆర్టిస్టులు నటిస్తున్న సంగతి తెలిసిందే.