తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నిన్న రూ. 1.89 కోట్ల ఆదాయం

21-07-2021 Wed 09:21
  • రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా ప్రభావం
  • సోమవారం స్వామి వారిని దర్శించుకున్న 17,310 మంది
  • నిన్న తలనీలాలు సమర్పించుకున్న 7,037 మంది
 crowd at Thirumala with Devotees

కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా తిరుమల పరిసరాలు మళ్లీ భక్తులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి. సోమవారం వేంకటేశ్వరస్వామి వారిని 17,310 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 7,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా నిన్న రూ. 1.89 కోట్ల ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.