నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

21-07-2021 Wed 07:51
  • మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు 
  • ఉత్తర, తెలంగాణలోని పలు జిల్లాలలో నేడు భారీ వర్షాలకు అవకాశం
  • జిల్లాల వారీగా వెల్లడించిన వాతావరణశాఖ
Heavy rains forecase telangana another three days

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నేడు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని;  ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయంశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, నిర్మల్, నిజామాబాద్, కరీనగర్, ఉమ్మడి వరంగల్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.