సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-07-2021 Wed 07:25
  • వీరిలో బాలకృష్ణ హీరోయిన్ ఎవరో? 
  • మళ్లీ వస్తున్న 'సఖి' నాయిక
  • వచ్చే నెలలో సంపూ 'బజార్ రౌడీ'  
Balakrishna to romance with Shruti Hassan for his next

*  ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ.. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, శ్రుతిహాసన్, తమన్నాలలో ఒకరు నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎవరన్నది మరో వారం రోజుల్లో తేలిపోతుంది.
*  గతంలో మణిరత్నం దర్శకత్వంలో 'సఖి' సినిమాలో కథానాయికగా నటించి.. కొన్నాళ్లకు హీరో అజిత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన శాలిని మళ్లీ సినిమాలలో నటించడానికి రెడీ అవుతోంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో శాలిని నటించనున్నట్టు తాజా సమాచారం.
*  'హృదయ కాలేయం' వంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరో సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బజార్ రౌడీ'. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.