టీమిండియా టాపార్డర్ ను కట్టడి చేసిన లంక బౌలర్లు

20-07-2021 Tue 22:16
  • కొలంబోలో టీమిండియా, శ్రీలంక మ్యాచ్
  • టీమిండియా టార్గెట్ 276 రన్స్
  • 32 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన భారత్
  • రాణించిన లంక బౌలర్లు
Sri Lanka bowlers restricts Indian top order

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత టాపార్డర్ తడబాటుకు గురైంది. 276 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 32 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు. కృనాల్ పాండ్య 34, దీపక్ చాహర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలో పృథ్వీ షా 13, కెప్టెన్ శిఖర్ ధావన్ 29 పరుగులు చేసి హసరంగ బౌలింగ్ లో అవుటయ్యారు. చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 1 పరుగు చేసి కసున్ రజిత బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (53), మనీష్ పాండే (37) రాణించారు. మనీష్ పాండే రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (0) డకౌట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సందాకన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.