రఘురామ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అమిత్ షా

20-07-2021 Tue 21:53
  • ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు
  • అమిత్ షాను ఆయన చాంబర్లోనే కలిసిన రఘురామ 
  • కొంతకాలంగా వైసీపీతో రఘురామకు పొసగని వైనం
Amit Shah asks Raghu Rama Krishna Raju health condition

ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా చాంబర్ కు వెళ్లిన రఘురామ... ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితి గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.

గత కొంతకాలంగా రఘురామకు, వైసీపీ అధినాయకత్వానికి మధ్య తీవ్ర పోరాటం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేవిధంగా రఘురామ మీడియా సమావేశాలు నిర్వహించడం వైసీపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సీఐడీతో తనను అరెస్ట్ చేయించడం పట్ల రఘురామరాజు కూడా రగిలిపోతున్నారు. విచారణలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన ఫిర్యాదులు చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత ఇటీవలే ఢిల్లీ ఎయిమ్స్ లోనూ చికిత్స పొందారు.