తెలంగాణలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు

20-07-2021 Tue 21:42
  • గత 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 74 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 9,787 మందికి చికిత్స
Telangana corona cases report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు నిర్వహించగా, 657 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74, ఖమ్మం జిల్లాలో 58 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ పేట్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 704 మంది కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,38,030 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,24,477 మంది మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 9,787 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,766కి చేరింది.