రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు: ప్రవీణ్‌కుమార్‌

20-07-2021 Tue 17:16
  • ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
  • రాజకీయాల్లోకి రాబోతున్నారంటున్న ఆయన సన్నిహితులు
  • త్వరలోనే వివరాలను ప్రకటిస్తానన్న ప్రవీణ్
Coming to politics is not wrong says Praveen Kumar

ఐపీఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించిన ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని, అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారిపోతుందని చెప్పడం సరికాదని అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని అన్నారు.

మరోవైపు ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారని కొందరు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆయన పూర్తిగా వ్యతిరేకమని... అందువల్ల బీజేపీలో చేరే అవకాశాలు ఏమాత్రం లేవని మరికొందరు అంటున్నారు. సొంతంగా పార్టీని స్థాపించే అవకాశం ఉందని కొందరు, బీఎస్పీలో చేరే అవకాశం ఉందని మరికొందరు చెపుతున్నారు.