వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: పీతల సుజాత

20-07-2021 Tue 17:03
  • అమరావతి భూముల్లో అవకతవకలు జరగలేదని సుప్రీం చెప్పడం వైసీపీకి చెంపపెట్టు
  • నిరాధారమైన ఆరోపణలతో కోర్టులకు వెళ్లడం మానుకోవాలి
  • పాలకులు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే రాజ్యాంగం ఒప్పుకోదు
YSRCP govt has to change its mindset says Peethala Sujatha

అమరావతి భూముల్లో అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరును మార్చుకోవాలని... నిరాధారమైన ఆరోపణలతో కోర్టులకు వెళ్లి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉండాలని... పాలకులు వారికి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే రాజ్యాంగం ఒప్పుకోదని అన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ... ఇప్పటికైనా ఆ ప్రాంతంలోని నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.