రెండో వన్డే: శ్రీలంకకు శుభారంభం అందించిన ఓపెనర్లు... దెబ్బతీసిన చహల్

20-07-2021 Tue 17:02
  • కొలంబోలో భారత్, శ్రీలంక రెండో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక
  • తొలి వికెట్ కు 77 రన్స్ జోడించిన ఆవిష్క, భానుక
  • చహల్ కు రెండు వికెట్లు.. ఓ వికెట్ తీసిన భువీ
Chahal scalps two quick wickets after Sri Lanka openers fifty more partnership

కొలంబోలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. 25 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక తొలి వికెట్ కు 77 పరుగులు జోడించి సరైన పునాది వేశారు.

భానుక 36 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన రాజపక్స... చహల్ బౌలింగ్ లోనే ఆడిన తొలిబంతికే వెనుదిరిగాడు. దాంతో ఓపెనర్ ఆవిష్క... ధనంజయ డిసిల్వాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే సరిగ్గా 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆవిష్కను టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లంక మూడో వికెట్ కోల్పోయింది.