విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ ప్రశ్న

20-07-2021 Tue 15:46
  • కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • విభజన చట్టం అంశాన్ని లేవనెత్తిన ఎంపీ రామ్మోహన్
  • మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక జవాబు
  • విభజన చట్టంలో చాలా అంశాలు అమలుచేసినట్టు వెల్లడి
TDP MP Ram Mohan Naidu questions Union Govt on bifurcation act

ఏపీ విభజన చట్టం అమలుపై  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో సమాధానమిచ్చారు. విభజన చట్టంలో చాలా అంశాలు అమలు చేశామని, కొన్ని అమలు దశలో ఉన్నాయని వివరించారు. మౌలిక వసతులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటుకు పదేళ్ల సమయం ఉందని స్పష్టం చేశారు.

విభజన చట్టం అంశాల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు నిత్యానందరాయ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.