హ్యాకింగ్ బారినపడ్డ ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్

20-07-2021 Tue 15:26
  • మూడ్రోజులుగా హ్యాకర్ల అధీనంలో ఖుష్బూ ఖాతా
  • తాజా పోస్టులు తనవి కావని స్పష్టీకరణ
  • ట్విట్టర్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ఖుష్బూ 
Khushbu Twitter account hacked for past three days

ఇటీవల ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ బారినపడడం పరిపాటిగా మారింది. తాజాగా, ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ మహిళా నేత ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. గత మూడ్రోజులుగా ఆమె ఖాతా హ్యాకర్ల అధీనంలోనే ఉన్నట్టు గుర్తించారు.

దీనిపై ఖుష్బూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, దీనిపై ట్విట్టర్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. గత మూడ్రోజులుగా తన ఖాతాలో పోస్టు అయిన ట్వీట్లు తనవి కావని స్పష్టం చేశారు.