టీమిండియాతో రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక

20-07-2021 Tue 14:52
  • కొలంబోలో నేడు రెండో వన్డే
  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • లంక జట్టులో ఓ మార్పు
  • ఉదన స్థానంలో కసున్ రజితకు స్థానం
  • ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న భారత్
Sri Lanka has won the toss against Team India in second ODI

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేడు కొలంబో ప్రేమదాస స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టులో ఉదన స్థానంలో కసున్ రజిత తుదిజట్టులోకి వచ్చాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొదటి వన్డేలో ఆడిన జట్టునే బరిలో దింపుతున్నారు.

కాగా, మూడు వన్డేల సిరీస్ లో భారత్ తొలి వన్డేలో నెగ్గింది. తద్వారా సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆతిథ్య లంక కృతనిశ్చయంతో ఉంది. అయితే, మొదటి వన్డేలో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూసిన తర్వాత లంక నేటి మ్యాచ్ లో ఏమేరకు రాణిస్తుందన్నది సందేహమే. తొలి వన్డేలోనూ లంక టాస్ నెగ్గి ఓ మోస్తరు స్కోరు చేయగా, భారత్ అలవోకగా ఛేదించడం తెలిసిందే.