నా బయోపిక్ అప్పుడే తీయెద్దు: ప్రియాంక చోప్రా

20-07-2021 Tue 14:38
  • ప్రియాంక బయోపిక్ తీసేందుకు జరుగుతున్న సన్నాహకాలు
  • తాను జీవితంలో సాధించాల్సింది ఇంకా ఉందన్న ప్రియాంక
  • అన్నీ సాధించిన తర్వాత బయోపిక్ తీయాలని కోరిన వైనం
Dont make my biopic says Priyanka Chopra

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా కొనసాగిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపు పొందింది. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. తన కెరీర్ లో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. మరోవైపు బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక హిట్ సినిమాకు అవసరమైన అన్ని కోణాలు ప్రియాంక చోప్రా జీవితంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ ను తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా స్పందిస్తూ, తన బయోపిక్ ను అప్పుడే తీయవద్దని కోరింది. జీవితంలో తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని... తాను అన్నీ సాధించిన తర్వాత తన బయోపిక్ ను తీయాలని కోరింది. ప్రియాంక ఇటీవలే తన 39వ పుట్టినరోజును లండన్ లో జరుపుకుంది. తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే.