ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబానికి షర్మిల పరామర్శ

20-07-2021 Tue 14:08
  • గంగదేవిపాడులో షర్మిల నిరుద్యోగ దీక్ష  
  • నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఓదార్పు  
  • కుటుంబానికి అండగా ఉంటామని హామీ
Sharmila Starts Nirdyoga Deeksa in Gangadevipadu

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంగదేవిపాడుకు వెళ్లిన ఆమె.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు.

ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి.. దీక్షలో కూర్చున్నారు.