భారత్​ కు 75 లక్షల మోడర్నా టీకాలు: డబ్ల్యూహెచ్​ వో

20-07-2021 Tue 13:37
  • కొవ్యాక్స్ ద్వారా సరఫరా
  • ఎప్పుడొస్తాయన్న దానిపై స్పష్టత కరవు
  • త్వరలోనే కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు
WHO Assures 75 Lakh Moderna Vaccine Doses To India

భారత్ కు 75 లక్షల మోడర్నా కరోనా టీకాలను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. సంస్థ చేపట్టిన కొవ్యాక్స్ కార్యక్రమం కింద వాటిని సరఫరా చేస్తామన్నారు. దేశంలో ‘ఇండెమ్నిటీ’ బాండ్ కు సంబంధించిన సమస్య క్లియర్ అయ్యాక, టీకా డోసుల స్టాక్ ను బట్టి వాటిని భారత్ కు పంపిస్తామని డబ్ల్యూహెచ్ వో ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో.. ఈ 75 లక్షల టీకాలు ఎప్పుడొస్తాయన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది.  

మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతులపై డబ్ల్యూహెచ్ వో సమీక్ష చేస్తోందని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ప్రీ సబ్ మిషన్ సమావేశం పూర్తయిందని ఆమె చెప్పారు.