టీఆర్ఎస్ లో చేరనున్న కౌశిక్ రెడ్డి

20-07-2021 Tue 11:47
  • రేపు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న కౌశిక్ రెడ్డి
  • ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వైనం
  • హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం
Koushik Reddy to join TRS tomorrow

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను అందించేందుకు హైదరాబాద్ కొండాపూర్ లోని తన నివాసంలో ఈరోజు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులకు సమాధానాలు కూడా ఇవ్వకుండానే ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. హుజూరాబాద్ టికెట్ ఆయనకే దక్కుతుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.