శర్వానంద్, రష్మిక జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్ ప్రారంభం!

20-07-2021 Tue 11:34
  • దర్శకుడిగా కిషోర్ తిరుమల
  • నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్  
  • ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాల చిత్రీకరణ 
Aadavaallu Meeku Johaarlu movie shooting started

శర్వానంద్  - రష్మిక జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రాజెక్టును ప్రకటించి చాలా రోజులే అయింది. అయితే ఒక వైపున దర్శకుడిగా కిషోర్ తిరుమల .. మరో వైపున హీరోగా శర్వానంద్ .. ఇంకో వైపున హీరోయిన్ గా రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన, ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన ఫొటోను వదిలారు. శర్వానంద్ - రష్మికలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమానంగా కలుపుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కిషోర్ తిరుమల సిద్ధస్తుడు. 'నేను శైలజ' .. 'చిత్రలహరి' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇటీవల రామ్ హీరోగా ఆయన చేసిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఆ తరువాత ప్రాజెక్టుగా కిషోర్ తిరుమల ఈ సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ జోడీగా రష్మిక తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న 'మహాసముద్రం' .. 'ఒకే ఒక జీవితం' తరువాత ఈ సినిమా థియేటర్లకు  రానుంది.