దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

20-07-2021 Tue 10:43
  • 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 45,254
  • దేశ వ్యాప్తంగా 374 మంది మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,130
India reports 30093 new corona cases

భారత్ లో కొత్తగా 30,093 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 45,254 మంది కరోనా నుంచి కోలుకోగా... 374 మంది మృతి చెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,11,74,322 కేసులు నమోదయ్యాయి.

మొత్తం 3,03,53,710 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,14,482 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 41,18,46,401 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.