నేను రాజీనామా చేయలేదు.. చేయబోను: రఘురామరాజు స్పష్టీకరణ

20-07-2021 Tue 06:32
  • రఘురామరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం
  • తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న ఎంపీ  
  • వైసీపీ ఎంపీలు పార్లమెంటులో భయపడుతూ కనిపించారన్న రఘురామరాజు
Wont resign to MP post said Raghurama Raju

ఎంపీ పదవికి తాను రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. వాటిపై తాను స్పీకర్‌కు వివరణ ఇస్తానని పేర్కొన్నారు.

వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎవరో భయపెట్టినట్టు సభలో వారు బెరుకుగా కనిపించారని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.