Andhra Pradesh: రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవోను నిలిపివేసిన ఏపీ సర్కారు

AP govt halts its orders
  • సాధారణంగా రెవెన్యూ శాఖ పరిధిలో రెండు విభాగాలు
  • సౌలభ్యం కోసం ఆర్థికశాఖలో విలీనం
  • కొన్నాళ్ల కిందట జీవో జారీ
  • అనూహ్యరీతిలో జీవో నిలిపివేస్తూ సీఎస్ ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం పరిపాలనా పరంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. ఈ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నుల విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ కొన్నాళ్ల క్రితమే జీవో జారీ అయింది. వాస్తవానికి ఈ రెండు విభాగాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయి. జీవో తీసుకువచ్చిన నేపథ్యంలో, వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డైరక్టరేట్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ వంటివన్నీ ఆర్థికశాఖ నియంత్రణలో పనిచేస్తాయని జీవో జారీ చేసిన సమయంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణను సులభతరం చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. అయితే, ఇప్పటికిప్పుడు జీవోను నిలుపుదల చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh
Orders
Registrations
Commercial Taxes
Financial Department

More Telugu News