సముద్రంలో 15 మంది మత్స్యకారుల గల్లంతు... హోంశాఖ సహాయమంత్రిని కలిసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

19-07-2021 Mon 20:22
  • చేపలవేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు
  • ఈ నెల 16న నిలిచిపోయిన బోటు
  • అప్పటినుంచి ఆచూకీ లేని మత్స్యకారులు
  • వారిని రక్షించాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ రామ్మోహన్
Fishermen stuck in mid sea after their boat stranded

సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలో మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని, ఈ నెల 16న వారి బోటు సముద్రంలో ఆగిపోయిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బోటులో సాంకేతిక లోపం వచ్చిందని కోస్ట్ గార్డ్ దళాలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని పేర్కొన్నారు. మత్స్యకారులను రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.