ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్పందన

19-07-2021 Mon 18:40
  • ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పిటిషన్ కొట్టివేత 
  • రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని ఉద్ఘాటన
  • సీఎం తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ
Atchannaidu responds after Supreme Court dismiss AP govt petition

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం తెలిసిందే. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. రాజధాని భూముల అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. సుప్రీం తీర్పుతోనైనా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హితవు పలికారు. సీఎం తీరు మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న స్పష్టం చేశారు.