బరిలోకి దిగుతున్న 'బంగార్రాజు' .. ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి!

19-07-2021 Mon 17:07
  • వాయిదా పడుతూ వచ్చిన ప్రాజెక్టు
  • ఆగస్టు 16 నుంచి షూటింగు
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
  • చైతూ జోడీగా కృతి శెట్టి      
Bangarraju shooting will start in next month

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' రూపొందనుంది. ఈ పాటికే నాగార్జున ఈ సినిమా పూర్తిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇంతకాలానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు.

ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. ఈ పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక ఖరారైపోయిందని తాజాగా అంటున్నారు. గ్రామీణ వాతావరణంలోనే ఈ కథ నడవనుంది. 'సంక్రాంతి' బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశంతో నాగ్ ఉన్నాడని అంటున్నారు. నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా విజయాన్ని సాధించింది. మరి 'బంగార్రాజు' ఆ రేంజ్ లో దూసుకెళుతుందో లేదో చూడాలి.