రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్న నేహా ధూపియా

19-07-2021 Mon 17:06
  • 2017లో అంగద్ బేడీని పెళ్లాడిన నేహా ధూపియా
  • అదే ఏడాది మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సినీనటి
  • బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం
Neha Dhupia posts baby bump photo

బాలీవుడ్ నటి నేహా ధూపియా రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ ఆనందకర విషయాన్ని ఆమే స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. మంచి క్యాప్షన్ తో రావడానికి తమకు రెండు రోజులు పట్టిందని ఆమె అన్నారు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. తన భర్త, కూతురుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

సినీ నటుడు, మోడల్ అంగద్ బేడీని 2017 మే నెలలో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కుమారుడే అంగద్ బేడీ. అదే సంవత్సరం నవంబర్ లో మెహర్ అనే బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు... 'పరమవీరచక్ర', 'విలన్', 'నిన్నే ఇష్టపడ్డాను' వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు.