రామ్ కి విలన్ గా మారుతున్న ఆది పినిశెట్టి!

19-07-2021 Mon 16:16
  • లింగుస్వామి దర్శకత్వంలో రామ్ సినిమా
  • కొన్ని రోజులుగా హైదరాబాదులో షూటింగ్  
  • ఆదికి స్వాగతం చెబుతూ పోస్టర్ విడుదల 
  • త్వరలో షూటింగులో చేరనున్న ఆది  
Aadi Pinishetty plays villan for Ram

ఏ సినిమాకైనా కథానాయకుడు ఎంతో .. ప్రతినాయకుడు కూడా అంతే! రెండు పాత్రలూ పోటాపోటీగా ఉంటాయి కాబట్టి హీరోకి తగ్గా విలన్ ని ఎంపిక చేసుకోవాలి. అందుకే, ఈ విషయంలో మన దర్శక నిర్మాతలు చాలా కసరత్తే చేస్తుంటారు.

ఇక నేటి యంగ్ హీరోలలో కొందరు అప్పుడప్పుడు మంచి పాత్రలు దొరికితే కనుక విలన్ గా కూడా నటిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఆది పినిశెట్టి కూడా ఒకరు. ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా విలన్ గా కూడా మంచి పేరుతెచ్చుకున్న ఆది ఇప్పుడు హీరో రామ్ కు విలన్ గా మారుతున్నాడు.

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇందులోనే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించనున్నాడు. త్వరలోనే చిత్రం షూటింగులో ఆయన జాయిన్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆది పినిశెట్టికి స్వాగతం చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.