బక్కని నరసింహులుకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

19-07-2021 Mon 13:49
  • టీటీడీపీ నూతన సారధిగా బక్కని నరసింహులు
  • తెలంగాణలో టీడీపీ బలపడాలని ఆకాంక్షించిన చంద్రబాబు
  • గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పని చేసిన నరసింహులు
Chandrababu congratulates Bakkani Narasimhulu

తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతగా బక్కని నరసింహులుని చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీపీ నూతన సారధిగా బాధ్యతలను చేపట్టిన దళిత నేత, మాజీ శాసనసభ్యులు, ఆత్మీయులు బక్కని నరసింహులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.

మీ సారథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. 1994-99 మధ్య కాలంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బక్కని నరసింహులు పని చేశారు. మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన నరసింహులుకి పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు.