విశాల్ హీరోగా బోయపాటి మూవీ?

19-07-2021 Mon 12:16
  • 'అఖండ' పనుల్లో బోయపాటి 
  • నెక్స్ట్ మూవీ బన్నీతో చేసే ఛాన్స్ 
  • తదుపరి సినిమా విశాల్ తో 
  • త్వరలో పూర్తి వివరాలు
Vishal in Boyapati movie

తమిళంలోనే కాదు .. తెలుగులోను విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. అందువల్లనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతుంటాయి. అలాంటి విశాల్ నేరుగా తెలుగు సినిమా చేయాలనే ఆసక్తిని చాలా కాలంగా కనబరుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బోయపాటితో ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కథ - మాటలు ఎ.రత్నం అందిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుందని అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి 'అఖండ' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తరువాత సినిమా దాదాపు బన్నీతో ఉండొచ్చునని వార్తలొస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు'భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బన్నీ సినిమా తరువాతనే విశాల్ ప్రాజెక్టును బోయపాటి పట్టాలెక్కించవచ్చని అంటున్నారు.