పోల‌వ‌రంలో ఏపీ సీఎం జ‌గ‌న్ విహంగ వీక్ష‌ణం

19-07-2021 Mon 11:51
  • ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ప‌నుల ప‌రిశీల‌న‌
  • కాసేప‌ట్లో జల వనరుల శాఖ అధికారులతో స‌మీక్ష‌
  • దిశా నిర్దేశం చేయ‌ను‌న్న జ‌గ‌న్
jagan visits polavaram

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న డ్యామ్‌ పనులు, రేడియల్‌ గేట్లు, అప్రోచ్‌ చానల్‌, ఇత‌ర ప‌నుల‌ను ఆయ‌న విహంగ వీక్ష‌ణం ద్వారా పరిశీలిస్తున్నారు. కాసేప‌ట్లో జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకరబాబు తదితర అధికారుల‌తో క‌లిసి ప్రాజెక్టు పురోగతిపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు. గడువులోగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వివ‌రిస్తారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అక్క‌డ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోల‌వ‌రంలో అధికారుల‌తో భేటీ అనంత‌రం తాడేపల్లిలోని త‌న అధికారిక‌ నివాసానికి చేరుకుంటారు.