Ramcharan: చరణ్ సినిమా కోసం మొదలైన తమన్ కసరత్తు!

Thaman music for charan movie
  • చరణ్ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • మ్యూజిక్ చర్చలు పూర్తి  
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ 
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల

భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. శంకర్ సినిమా ప్రధమ లక్షణంగా కనిపిస్తుంది. తన సినిమాల విషయంలో శంకర్ ఎంతమాత్రం తొందరపడరు. చాలా కూల్ గా తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేవరకూ ఆయన చిత్రీకరణ కొనసాగిస్తూ వెళుతుంటారు. ఈ క్రమంలో ఆయన ఈ సారి, నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. చరణ్ కథానాయకుడిగా .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

హీరోగా చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, నిర్మాతగా దిల్ రాజుకి 50వ సినిమా. సాధారణంగా శంకర్ తన సినిమాలకు ఏఆర్ రెహ్మాన్ తో గానీ .. అనిరుధ్ తో గాని పాటలు చేయించుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ సారి ఆయన ఈ సినిమాకి తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలకు వీరు శ్రీకారం చుట్టారు. గతంలో చరణ్ సినిమాలకు తమన్ అందించిన పాటలు యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.    

  • Loading...

More Telugu News