దళితుల కోసం ప్రతిష్ఠాత్మక పథకాన్ని తీసుకొస్తున్న కేసీఆర్.. హుజూరాబాద్ నుంచి ప్రారంభం

19-07-2021 Mon 10:44
  • తెలంగాణ దళితబంధు పథకానికి శ్రీకారం
  • దళితుల సాధికారతే ఈ పథక లక్ష్యం
  • పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభం
KCT to start Telangana Dalita Bandhu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ప్రతిష్ఠాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. దళిత సాధికారత పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకానికి 'తెలంగాణ దళితబంధు' అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ పథకాన్ని తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ను ఎంపిక చేశారు.

అనేక పథకాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతో ఇష్టంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం వరకు చాలా వాటిని ఆయన కరీంనగర్ జిల్లాలోనే ప్రారంభించారు. రైతుబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ దళితబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించబోతున్నారు.