Monkeypox: అమెరికాలో 20 ఏళ్ల తర్వాత వెలుగులోకి అరుదైన ‘మంకీపాక్స్’ వ్యాధి!

  • బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు
  • ప్రజలకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదని అభయం
  • బ్రిటన్‌లో గత నెలలో నాలుగు కేసులు
CDC and Texas Confirm Monkeypox In US

జంతువుల నుంచి మనుషులకు సోకే అరుదైన ‘మంకీపాక్స్’ వ్యాధి అమెరికాలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత వెలుగుచూసింది. ఈ వ్యాధి బారినపడిన వ్యక్తిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విమానంలో అతడితోపాటు ప్రయాణించిన వ్యక్తులను అప్రమత్తం చేశారు. దీనివల్ల ప్రజలకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ ఒక్క కేసే నమోదైందని స్పష్టం చేసింది. 2003లో చివరిసారి 47 మందికి ఇది సోకింది. బ్రిటన్‌లో గత నెలలో ఇలాంటివి నాలుగు కేసులు వెలుగుచూశాయి. స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందిన ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, నడుంనొప్పి, అలసట, కండరాల నొప్పి, ముఖం, అరచేయి, అరికాళ్లపై దద్దుర్లు, బొబ్బలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

More Telugu News