తిరుమల శ్రీవారికి రూ.1 కోటి విలువైన బంగారు ఖడ్గం చేయించిన హైదరాబాద్ భక్తుడు

18-07-2021 Sun 21:39
  • కలియుగ ప్రత్యక్ష దైవానికి మరో కానుక
  • స్వర్ణ నందకంను తయారుచేయించిన ఎంఎస్ ప్రసాద్
  • ఈ ఖడ్గం బరువు 6.5 కిలోలు
  • రేపు శ్రీవారికి బహూకరణ
Hyderabad devotee will donate precious ornament to Lord Venkateswara

కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తించే తిరుమల వెంకటేశ్వరస్వామి వైభోగం మరెవ్వరికీ సాధ్యం కాదు. నిత్యం ఆయనను దర్శించే భక్తుల సంఖ్య పరంగా, ఆయనకు అందే వస్తు, నగదు రూపేణా కానుకల విషయంలోనూ ఎవరూ వెంకన్నకు సాటిరారు. తాజాగా ఓ భక్తుడు తిరుమల శ్రీవారి కోసం రూ.1.08 కోట్ల విలువైన బంగారు ఖడ్గాన్ని తయారు చేయించారు.

హైదరాబాదుకు చెందిన ఎంఎస్ ప్రసాద్ అనే భక్తుడు స్వామివారికి ఈ స్వర్ణ నందకంను రేపు బహూకరించనున్నారు. దీని బరువు 6.5 కిలోలు. ఈ ఆభరణాన్ని ఆయన టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.