Team India: కొలంబోలో గెలుపు దిశగా టీమిండియా

  • శ్రీలంకతో తొలి వన్డే
  • టీమిండియా టార్గెట్ 263 రన్స్
  • ప్రస్తుతం భారత్ స్కోరు 15 ఓవర్లలో 127/1 
  • విజయానికి 136 పరుగులు అవసరం
  • చేతిలో 9 వికెట్లు
  • పృథ్వీషా, ఇషాన్ కిషన్ దూకుడు
Teamindia racing towards win against Sri Lanka in Colombo

శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. శ్రీలంక విసిరిన 263 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 15 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 35 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఓపెనర్ పృథ్వీ షా 24 బంతుల్లో 9 ఫోర్లతో 43 పరుగులు సాధించి ధనంజయ డి సిల్వా బౌలింగ్ లో అవుటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. కిషన్ 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు సాధించడం విశేషం. ఐపీఎల్ ఆడిన అనుభవంతో రాటుదేలిన భారత బ్యాట్స్ మెన్ ముందు తొలి పవర్ ప్లేలో శ్రీలంక కుర్ర బౌలర్లు తేలిపోయారు.

అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది.

More Telugu News