JC Pawan Reddy: రేపు 'ఛలో తాడేపల్లి' నేపథ్యంలో అనంతపురంలో జేసీ పవన్ రెడ్డి అరెస్ట్

  • కొత్త జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగుల డిమాండ్
  • రేపు 'ఛలో తాడేపల్లి' కార్యక్రమానికి పిలుపు
  • అనుమతి లేదన్న గుంటూరు ఎస్పీ
  • అనంతపురంలో జేసీ పవన్ రెడ్డి నిరసనలు
  • పవన్ రెడ్డిని పీఎస్ కు తరలించిన పోలీసులు
Police arrests JC Pawan Reddy in Ananthapur ahead of Chalo Tadepalli

జాబ్ క్యాలెండర్ ను సవరించాలని కోరుతూ ఏపీలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు కొన్నిరోజులుగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రేపు 'ఛలో తాడేపల్లి' కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అయితే సీఎం జగన్ నివాసం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 'ఛలో తాడేపల్లి'కి అనుమతిలేదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు చూసుకుంటే బాగుంటుందని ఆయన కాస్తంత హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరదీశారు.

సీఎం నివాసం ముట్టడికి వెళతారన్న సమాచారం నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందుగానే అడ్డుకుంటున్నారు. తాజాగా, అనంతపురంలో టీడీపీ యువనేత జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ పవన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో తన నివాసంలో ఇవాళ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలను అడ్డుకున్న పోలీసులు పవన్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Telugu News