ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు: ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

18-07-2021 Sun 12:47
  • రేప‌టి నుంచి పాద‌యాత్ర షురూ
  • ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉంటా
  • 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్ర
  • బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం  
eetela padayatra begins tomorrow

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రేప‌టి నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. 'ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జులై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను' అని ఆయ‌న చెప్పారు.

'ఉదయం 7.30 ని.లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు' అని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. కాగా, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌ జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.