Tirumala: ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజుకు 1000 శ్రీవారి దర్శన టికెట్లు!

  • శ్రీవారి భక్తులకు మరింత వెసులుబాటు 
  • బస్సు చార్జీలకు అదనంగా రూ. 300 చెల్లిస్తే టికెట్
  • ఉదయం 11, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం
APSRTC to sell Tirumala Srivari Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా కూడా శ్రీవారి దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు వెయ్యి టికెట్లను ఇందుకోసం ఆర్టీసీకి కేటాయిస్తుంది. భక్తులు బస్సు చార్జీలకు అదనంగా రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది.

ఆర్టీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News