మాన్సాస్ విద్యాసంస్థలను మీ రాజకీయ క్రీడల కోసం ఉపయోగించుకోవద్దు: సంచయిత

17-07-2021 Sat 19:03
  • మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన కళాశాల సిబ్బంది
  • జీతాలు చెల్లించాలని డిమాండ్
  • ఈవో చాంబర్లోకి దూసుకెళ్లిన వైనం
  • కాలేజీ సిబ్బందిని తప్పుదోవ పట్టించారన్న సంచయిత
Sanchaita Gajapathi comments on Asok Gajapathi

మాన్సాస్ ట్రస్టు కాలేజీ సిబ్బంది ఇవాళ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించడం తెలిసిందే. దీనిపై సంచయిత గజపతి స్పందిస్తూ, అశోక్ గజపతిరాజుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ క్రీడల కోసం మాన్సాస్ విద్యాసంస్థలను ఉపయోగించుకోవద్దని హితవు పలికారు. ట్రస్టు కాలేజీ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, ఈవోను బెదిరించేలా వారిని పురిగొల్పారని సంచయిత ఆరోపించారు.

"మా తాత గారు పీవీజీ రాజు, తండ్రి గారు ఆనంద గజపతి విద్యానైపుణ్యాలకు నిలయంగా 'మాన్సాస్' విలసిల్లాలని ఆకాంక్షించారు. కానీ వారిద్దరి ఘనతర వారసత్వాన్ని మీరు నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తోంది" అని ఆమె పేర్కొన్నారు.