ఎన్నికల నేపథ్యంలో విమర్శలు శాశ్వతం కాదు: వెంకటేశ్

  • మన చేతుల్లో ఏదీ లేదు
  • అందరికీ మంచి జరగాలి
  • 'నారప్ప' ఓటీటీలో విడుదల అవుతోంది
Venkatesh response on MAA elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ వేడెక్కింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు రాజకీయ నేతలకు తగ్గని విధంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల వివాదంపై సినీ నటుడు వెంకటేశ్ స్పందిస్తూ... మన చేతుల్లో ఏదీ లేదని, అందరికీ మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చే విమర్శలు, మాట్లాడే మాటలు శాశ్వతం కాదని చెప్పారు.

తన తాజా చిత్రం 'నారప్ప' కోసం తాను శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించానని చెప్పారు. ఈ నెల 20న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. కరోనా కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తోందని అన్నారు.

More Telugu News