కాపులకు జగన్ పెద్ద పీట వేశారు: అడపా శేషు

17-07-2021 Sat 17:57
  • కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా అడపా శేషు నియామకం
  • సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శేషు
  • పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా పని చేస్తానని వ్యాఖ్య
Jagan giving much importance to Kapu community says Adapa Seshu

ఏపీ ప్రభుత్వం ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. ఈ సందర్భంగా అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కాపులకు జగన్ పెద్ద పీట వేశారని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదని చెప్పారు. పార్టీకి మంచి పేరును తీసుకొచ్చేలా పని చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అయిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నిబద్ధతతో పని చేస్తానని చెప్పారు. కాపు కులానికి అండగా నిలబడతానని అన్నారు. కాపు కార్పొరేషన్ కు జగన్ ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు.