ఎన్టీఆర్ తో కొరటాల సినిమా బడ్జెట్ 200 కోట్లు?

17-07-2021 Sat 17:43
  • కొరటాల నుంచి మరో భారీ ప్రాజెక్టు
  • కథానాయకుడిగా ఎన్టీఆర్
  • గతంలో హిట్ తెచ్చిన 'జనతా గ్యారేజ్'  
  • కథానాయికగా తెరపైకి కైరా పేరు
Huge budjet fot Ntr and Koratala movie

ఎన్టీఆర్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు ఇప్పుడు అందరిలో ఆసక్తిని .. అంచనాలను పెంచేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' .. త్వరలో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత కొరటాల శివ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లో ప్రశాంత్ నీల్ సినిమా మాత్రమే పాన్ ఇండియా సినిమా అని అనుకున్నారు. కానీ కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ - కొరటాల సినిమా బడ్జెట్ 200 కోట్లు అని చెప్పుకుంటున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అనే విషయం తెలిసిందే. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే, ఆయా భాషలకి చెందిన ఆర్టిస్టులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారట. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు పూర్తయిన తరువాత, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు పైకి రానున్నాడు. 'జనతా గ్యారేజ్' హిట్ తరువాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలో అంచనాలు ఉన్నాయి. కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది గానీ, క్లారిటీ రావలసి ఉంది.