భూముల వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారు: రేవంత్ రెడ్డి ఆరోపణ
- రానున్న రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారు?
- చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయి
- కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి
కోకాపేట భూముల వేలం వల్ల రూ. 2 వేల కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ తెలిపిందని.... అయితే ఆన్ లైన్ వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయని అన్నారు. ఆన్ లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తర్వారా ఆ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారు. వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారని రేవంత్ అన్నారు. ఐదు కంపెనీలు కలిసి రూ. వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టాయని మండిపడ్డారు.