ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ

17-07-2021 Sat 17:00
  • ఖైరతాబాద్ లో వినాయక చవితి ఏర్పాట్లు
  • ఈసారి 40 అడుగుల విగ్రహం
  • పంచముఖ రుద్రమహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు
  • జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణపతి
Khairatabad Ganesh idol model unveiled

వినాయకచవితి సందర్భంగా హైదరాబాదులోని ఖైరతాబాద్ లో నిర్వహించే ఉత్సవాలు, భారీ గణపతి విగ్రహం జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ ఏడాది కూడా వినాయకచవితి ఉత్సవాలకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఇవాళ ఆవిష్కరించారు. ఈసారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత విగ్రహాలకు భిన్నంగా ఈ పర్యాయం పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమివ్వనున్నాడు. ఎడమవైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.