హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడంపై షర్మిల కీలక ప్రకటన

17-07-2021 Sat 16:33
  • హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయం
  • ఉపఎన్నిక వల్ల ఎలాంటి ఉపయోగం లేదు
  • పగ, ప్రతీకారం కోసమే ఉపఎన్నికలు వచ్చాయి
We are not contesting in Huzurabad bypolls says  YS Sharmila

హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల... రాజకీయపరంగా దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కీలక ప్రకటన చేశారు.

 హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అని అడిగారు. దళితులకు మూడెకరాల భూమి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని ప్రభుత్వం చెపితే తాము కూడా పోటీ చేస్తామని చెప్పారు. పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలే హుజూరాబాద్ ఉపఎన్నికలని అన్నారు.