DK Aruna: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు మేలు జరుగుతుంది: డీకే అరుణ

  • కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ఇన్నాళ్లు అన్యాయం జరిగింది
  • ఏపీ అక్రమ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిలిపివేస్తుంది
  • విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసింది
Centers decision helps Telangana says DK Aruna

కృష్టా జలాల వినియోగంలో ఇన్నాళ్లు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కుమ్మక్కైన సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేఆర్ఎంబీ (కృష్ణా నది యాజమాన్య బోర్డు) నిలిపేస్తుందని చెప్పారు.

కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై టీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు మేలు చేస్తుందని చెప్పారు.

More Telugu News