కదులు సోదరా.. సెలవులు అయిపోయాయ్​: రోహిత్​ సరదా కామెంట్​

17-07-2021 Sat 14:10
  • శిక్షణ శిబిరంలో చేరిన హిట్ మ్యాన్
  • ట్విట్టర్ లో సాధన చేస్తున్న ఫొటోలు పోస్ట్
  • నిన్నటి నుంచి టీమిండియా సాధన షురూ
  • ఫొటోలు షేర్ చేసిన కోహ్లీ, బీసీసీఐ
Rohit Funny Comments On Training Session

మూడు వారాల ‘బ్రేక్’కు ఇక బ్రేక్ పడింది. టీమిండియా ఆటగాళ్లంతా బయోబబుల్ ను వీడి నెట్స్ బాట పట్టారు. ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి ఆగస్టులో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు కోసం ఇప్పటి నుంచే చెమటోడ్చడం మొదలుపెట్టారు. నిన్నటి నుంచి డర్హమ్ లో మొదలైన శిక్షణ శిబిరంలోకి.. కెప్టెన్ కింగ్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ జడేజాలు చేరిపోయారు.


శిక్షణపై ట్విట్టర్లో రోహిత్ సరదాగా కామెంట్ చేశాడు. ‘కదులు సోదరా.. సెలవులు అయిపోయాయి. ఇక పని మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి తోడుగా నెట్స్ లో శ్రమిస్తున్న ఫొటోలను జత చేశాడు. ఇక, బీసీసీఐ కూడా ఆటగాళ్లు సాధన చేస్తున్న ఫొటోను నెటిజన్లతో పంచుకుంది. హలో డర్హమ్.. ఇక్కడకు వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టింది.


కాగా, రోహిత్ ను నెట్ సెషన్స్ లో చూసిన అభిమానులూ హుషారెత్తిపోయారు. ‘కెప్టెన్’ అంటూ కామెంట్లు చేశారు. ‘హిట్ మ్యాన్’ గొప్పోడు అంటూ రిప్లైలు ఇచ్చారు. ఇటు కింగ్ కోహ్లీ కూడా కె.ఎల్. రాహుల్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘మళ్లీ మొదలు’ అని ట్యాగ్ పెట్టాడు.